సోమవారం బ్రాహ్మణ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కార్యక్రమంలో మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు విషయం పై స్పందించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూస్తున్నారని మండిపడ్డారు.

1986 దేవాదాయ చట్టాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం సవరించిందన్నారు. దీని వాళ్ళ చిన్న చిన్న ఆలయాలు మూతపడ్డాయని కృష్ణారావు తెలిపారు. 2007 లో ఈ చట్టాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి సవరించారని తెలిపారు. 1986 చట్ట సవరణతో మిరాశీ పోయిందని, 2007 చట్ట సవరణతో మరోసారి మిరాశీ అంశంపై స్పష్టంత వచ్చింద​న్నారు. దీనిని అర్ధం చేసుకోవడానికి ముఖ్యమంత్రికి సమయం లేకుండా పోయిందన్నారు.

చంద్రబాబు తాను పనిచేయడం కన్నా చేస్తున్నారనే దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. బ్రాహ్మణులతో బ్రహ్మనులనే తిట్టించాలానే పాలసీ పెట్టుకున్నారన్నారు. కరుడుకట్టిన కులస్వామ్యంతో తెలుగుదేశం పార్టీ నడుస్తోందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే కౌంటర్ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. ఆగమ పరీక్షలో ఫెయిలైన వారిని ప్రధాన అర్చకునిగా నియమిస్తారా అని ప్రశ్నించారు. వారసత్వానికి కూడా సమర్ధత ఉండాలన్నారు. శాతవాహన కాలేజీని ఆక్రమించేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తే ముఖ్యమంత్రి కార్యాలయం నుండే మద్దతు రావడం దారుణమన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments