రోజూ లాగే ఉదయం 6 గంటలకు న్యూ డిల్లీ స్టేషన్ నుండి విశాఖకు బయలుదేరిన ఏపీ ఎక్స్ ప్రెస్ బయలుదేరింది. గ్వాలియర్ సమీపానికి వచ్చేసరికి ఒక్కసారిగా రైల్ లో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఇది గమనించిన ట్రైన్ డ్రైవర్ ట్రైన్ ను ఆపివేయడంతో ప్రజలు భయంతో పరుగు తీశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు. ఈ ప్రమాదం లో రెండు కోచ్ లు పూర్తిగా దగ్దమయ్యాయి . షార్ట్ సర్క్యూట్ జరగడం వల్లనే అగ్ని ప్రమాదం జరగడానికి కారణమని రైల్వే అధికారులు చెప్తున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Subscribe
Login
0 Comments