ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో సోమవారం హుండీల్లోని కానుకలను లెక్కించారు. 22 హుండీలను లెక్కించగా 18 రోజులకుగాను రూ.1,96,37,217 కోట్లు రికార్డు స్థాయిలో నగదు రూపంలో ఆదాయం లభించింది. అలాగే 0.562 గ్రాముల బంగారం, 5.002 గ్రాముల వెండి వస్తువులను భక్తులు జగన్మాత కనకదుర్గమ్మకు కానుకలుగా సమర్పించారు. హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని పాలకమండలి ఛైర్మన్ యలమంచలి గౌరంగబాబు, పలువురు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
రికార్డు స్థాయిలో దుర్గమ్మ హుండీ ఆదాయం
Subscribe
Login
0 Comments