ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నేడు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి పుట్టపర్తి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలీకాప్టర్ లో పెనుకొండ నియోజికవర్గంలోని రోద్దం మండలం లోని తురకలాపట్నానికి వెళ్లనున్నారు. ఆ గ్రామంలోని చెరువులో జలహారతి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం, తురకలాపట్నంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లకు భూమి పూజ చేస్తారు. ‘రచ్చబండ’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో ముఖాముఖీ మాట్లాడతారు. ఈ సందర్భంగా నిర్వహించే ఓ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించనున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments