ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో సహా తెలుగుదేశం పార్టీ నేతలు ఈ మధ్య తమ ఆసక్తికరమైన వ్యాఖ్యల వల్ల వార్తలలో నిలుస్తున్నారు . తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని  అమరావతిలో సోమవారం నీరు-ప్రగతి పధకంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన టెలీకాన్ఫరెన్స్ జరిగింది . ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు . రాష్ట్రం లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఎండను తగ్గించాలని అధికారులను ఆదేశించారు. మరీ ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో కచ్చితంగా 10 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గించాలని హుకుం జారీ చేసారు. ఈ వ్యాఖ్యలతో అధికారులు షాక్ కు గురై తామెలా ఉష్ణోగ్రతలు తగ్గించగలమని విస్మయం చెందారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments