ప్రముఖ యాంకర్,నటుడు మహమ్మద్ కయిమ్(లోబో) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు.  జనగాం జిల్లా రఘునాధపల్లి మండలం నిడిగొండ సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న కారు ఆటోని  ఢీకొంది .  ఈ ప్రమాదంలో లోబో తో పాటు ఆటో లో ప్రయాణిస్తున్న ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  వారిని చికిత్స నిమిత్తం జనగాం ఏరియా ఆసుపత్రికి తరలించారు.  ఈ విషయం తెలుసుకున్న జనగాం డీఎస్పీ మల్లారెడ్డి ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించి,ప్రమాదం వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments