విభిన్నమైన సినిమాలు చేస్తూ విజయపధంలో దూసుకుపోతున్నారు హీరో శర్వానంద్ . ఈయన ప్రస్తుతం హను రాఘవపూడి దర్సకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పడి పడి లేచే మనసు. ఇప్పుడు వరుస విజయాలు అందుకుంటున్నా మొదరి రోజులలో శర్వానంద్ చాలా కష్టాలు పడిన విషయం తెలిసినదే .

తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ  కెరీర్ లో తాను చేసిన అతి పెద్ద పొరపాటు నిర్మాతగా మారడం అన్నారు.  కో అంటే కోటి సినిమాను నిర్మించాలనుకోవడం తాను తీసుకున్న తప్పుడు నిర్ణయమన్నారు.  అప్పటి వరకు సంపాదించినదంతా ఆ సినిమాలో పెట్టేశానని ఆ సినిమా పెద్ద ఫ్లాప్ గా మిగిలందన్నారు.  దానితో ఆర్ధిక ఇబ్బందుల నుండి బయట పడడానికి మూడేళ్ళు పట్టిందన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments