స్టార్ డైరెక్టర్ శంకర్ దర్సకత్వంలో తలైవా సూపర్ స్టార్ నటిస్తున్న చిత్రం 2.0 . గతంలో విజయవంతమైన రోబో కు ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా గతేదాడే విడుదవ్వవలసి ఉంది. కాని కొన్ని సాంకేతిక కారణాల వాళ్ళ ఇంకా రిలీజ్ కాలేదు . 2.0 సినిమాకు సంబంధించి కనీసం టీజర్ కూడా విడుదలవ్వకపోవడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు.

అయితే ఇప్పుడు సినిమాకి సంబంధించి ఒక వార్త సర్కులేట్ అవుతోంది . అదేంటంటే ఈ సినిమాకు సంబందించిన టీజర్ ను మే 27 న ముంబై వంఖేడే స్టేడియం లో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో విడుదల చేయనున్నారట. ఈ సినిమాను దాదాపు రూ. 400 కోట్ల భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం వహిస్తున్నారు. ఈ సినిమా ఆగష్టు లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments