తిరుమల శ్రీవారి ఆలయం రాజకీయనాయకులు చేతిలోకి వెళ్లిపోయిందని, స్వామి వారి పూజా కైంకర్యాల వ్యవహారంలో అధికారులు తలదూరుస్తున్నారని, వకుళామాత  పోటులో బండలు మార్చే నిమిత్తం చాలా రోజులుగా దానిని మూసివేశారని పూర్వ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు పలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను టీటీడీ ఖండించింది. నాడు వెయ్యికాళ్ల మండపం కూల్చివేతకు అంగీకరిస్తూ రమణదీక్షితులు సంతకాలు చేసిన పత్రాలను టీటీడీ బయటపెట్టింది. వకుళామాత పోటులో ఎటువంటి తవ్వకాలు జరగలేదని, కేవలం  మరమ్మతుల నిమిత్తం పనులు చేశామని చెప్పింది. ఈ సంద్భంగా పోటును చూసేందుకు మీడియాను ఆహ్వానించి దాని లోపలికి పంపింది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments