సౌత్ ఇండియా లో టాప్ డైరెక్టర్ అంటే శంకర్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు . ఇప్పుడు రోబో 2.0 సినిమా రూపకల్పనలో బిజీగా ఉన్నారు. సాధారణంగా ఆయన ఎక్కడ చూసినా కూడా చాలా కూల్ గా ఉంటారు,ఆయినా భావోద్వేగానికి గురైన దాఖలాలు ఎక్కడా లేవు . కాని ఒక రోజు షూటింగ్లో లో ఆయన బోరుమని ఎద్చేసారట. ఆయనని ఒడార్చటం ఎవరి వాళ్ళ కాలేదట. ఈ విషయాన్ని ఫైట్ మాస్టర్ సెల్వ చెప్పారు.
శంకర్ విక్రం కాంబినేషన్లో వచ్చిన అపరిచితుడు సినిమాలో సదా అపరిచితుడి నుండి తప్పించుకోవడానికి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కార్యాలయానికి వెళుతుంది . అప్పుడు అపరిచుతుడు ఫైటర్స్ మీద ఎటాక్ చేస్తారు,వారు అప్పుడు ఎగిరి పడాలి . ఈ సన్నివేశం చిత్రీకరణ సమయంలో లోపల సెటప్ కు తగ్గట్టుగా ఓ లారీ కనెక్ట్ చేసి పెట్టారట . లోపల నుండి ఆదేశాలు రాకముందే లారీ డ్రైవర్ లారీని ముందుకు పోనిచ్చేటప్పటికి బిల్డింగ్ లోపల చాలా ఎత్తులో ఉన్న ఫైటర్లు కిందపదిపోయారట, కింద చాలా స్ట్రాంగ్ గా ఉండడంతో వాళ్లకు గాయాలవ్వడంతో ఫ్లోర్ మొత్తం రక్తంతో తడిసి ముద్దయిందట. దీనితో వాళ్ళ బాధ చూసి శంకర్ భావోద్వేగం ఆపుకోలేక చాల సేపు బోరున ఎద్చేసారట.