తెలుగు సినీ నటుడు,రచయత ఉత్తేజ్ కు అనుకోని షాక్ తగిలింది. ఎలారేడ్డిగూడ లో తను నిర్వహిస్తున్న అలంకార్ డిజైనర్స్ వస్త్ర దుకాణం లో చోరీ జరిగింది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం ఉత్తేజ్ భార్య పద్మావతి షాపు లో ఉండగా నిన్న సాయంత్రం ముగ్గురు మహిళలు వచ్చి చీరలు కొంటున్నట్లు గా నటించి,పద్మావతి దృష్టిని మరల్చి రూ. 80 వేల రూపాయల విలువైన చీరలను దొంగలించారు. ఈ ఘటన పై ఉత్తేజ్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు,పోలీసులు కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ద్వారా మహిళలు ఎవరనే విషయం పై ఆరా తీస్తున్నారు.