చాలా రోజుల నుండి తమిళ ప్రజలు ఎప్పుఎప్పుడా అని ఎదురు చూస్తున్న మాట రజనీకాంత్ నోటి నుండి వెలువడింది. ఈరోజు ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాబోతున్నానని త్వరలోనే పార్టీ ను ప్రకటించి 2019 ఎన్నికలలో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. రజనీ గత కొన్ని నెలలుగా అభిమానులతో రాజకీయ అరంగేట్రం పై సమావేశాలు నిర్వహించి వారి సూచనలను తీసుకున్నారు. ఇంకా మాట్లాడుతూ కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోయే కుమారస్వామికి సుభాకాన్షలు తెలిపారు. ఈ కొత్త ప్రభుత్వంలోనైనా కర్ణాటక నుండి తమిళనాడు కు కావేరి నీళ్ళు విడుదలవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే మరో తమిళ్ సూపర్ స్టార్ కమల్ హస్సన్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసినదే. మరి రానున్న ఎన్నికలలో ఎవరు ఎంతమేరకు ప్రభావం చూపగాలరో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments