చుక్కులు చూపిస్తున్న డీజిల్,పెట్రోల్ ధరలు…

0
196

కర్ణాటక ఎన్నికలు ముగిసిన తరువాత నుంచి గత 8 రోజులుగా డీజిల్,పెట్రోల్ పెరుగుతున్నాయ్. ఈ పెంపులతో హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ. 80.76 కు చేరింది,ముంబై లో అత్యధికంగా రూ. 84.07 కు చేరింది. ఆయా రాష్ట్రాల పన్నున్ను బట్టి రిట్లలో వ్యత్యాసం ఉంటుంది .

కర్ణాటక ఎన్నికల కోసం రేట్ల పెంపును కేంద్ర సర్కారు 19 రోజుల పాటు ఆపి వేయించింది. కర్ణాటక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి ఎనిమిది రోజుల్లో పెట్రోల్ రూ.1.61, డీజిల్ రూ.1.64 చొప్పున పెరగడం గమనార్హం. భోపాల్ లో పెట్రోల్ ధర రూ.81.83, పాట్నాలో రూ.81.73, శ్రీనగర్ లో రూ.80.35 గా ఉంది. కొల్కత్తా రూ.78.91 కాగా, చెన్నైలో రూ.79.13. దేశంలోనే పెట్రోల్ ధర తక్కువగా లభిస్తున్న ప్రాంతం పంజిమ్. ఇక్కడ ధర రూ.70.26 మాత్రమే. డీజిల్ ధర త్రివేండ్రంలో రూ.73.34, రాయిపూర్ రూ.72.96, భువనేశ్వర్ లో రూ.72.43 చొప్పున ఉంది. అతి తక్కువగా పోర్ట్ బ్లెయిర్ లో రూ.63.35గా ఉండడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here