జనసేన అధినేత పవన కళ్యాణ్ పోరాట యాత్ర మొదటి రోజులో భాగంగా ఇచ్చాపురం తీరంలోని కపాసుకుద్ధిలో సముద్రస్నానంచేసి స్థానిక మత్యకారులతో కలిసి గంగాపూజ చేశారు. అనంతరం ఇచ్చాపురం లోని స్వీచ్చావతి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుండి స్థానిక రాజావారి మైదానం వరకు జనసేన కార్యకర్తలు,యువతతో,అభిమానులతో కలిసీ ప్రత్యేకహోదా కవాతు నిర్వహించారు .  అనంతరం రాజావారి మైదానంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ‘ప్రతి రాజకీయ పార్టీకి ‘జనసేన’ను విమర్శించడం తేలికైపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీ స్థాపించి, సమస్యలపై పోరాడటం కష్టం. జనసేన మనం స్థాపించుకున్న పార్టీ. టీడీపీ చంద్రబాబు స్థాపించిన పార్టీ కాదు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ. నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. ఉన్న డబ్బుని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చా. ‘జనసేన’కు జనబలం తప్ప మరేమీ లేదు’ అని అన్నారు. రాష్ట్రం విడిపోయాక అనుభవజ్ఞులైన నాయకులు కావాలని నాడు కోరుకున్నా, అందుకే, టీడీపీకి మద్దతిచ్చానని, ప్రత్యేకహోదా కోసమే ఆ పార్టీకి మద్దతిచ్చానని,దయచేసి తనను ప్రజలు క్షమించాలన్నారు.  టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాకా ఇన్ని హామీలు ఇచ్చారు కదా అవన్నీ అమలు జరుగుతాయా అని చంద్రబాబును అడిగానని, దానికి బాబు సమాధానంగా నేను కచ్చితంగా నేరవేరుస్తానన్నారు  అన్నారు

రైతు రుణ మాఫీ నుండి ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం సరిగ్గా నెరవేర్చలేదని, తాను అడిగినప్పుడల్లా నీకు రాజకీయ అనుభవం లేదు నీకు కొన్ని విషయాలు తెలియవు, ఇంకొంచెం సమయం పడుతుంది అనేవారన్నారు .అందరి అభివృద్ధి కోరుకునే పార్టీ జనసేన అని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ కార్యకర్తలపై దాడికి దిగితే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకహోదా అంశం గురించి పవన్ ప్రస్తావిస్తూ, చట్టసభల్లో చెప్పినవన్నీ త్రికరణశుద్ధిగా పాటిస్తారని తాను నమ్మానని, ఏళ్లు గడుస్తున్నాయి కానీ ‘హోదా’ హామీ నెరవేరడం లేదని విమర్శించారు. కొన్నిరోజులు అయిన తరువాత స్పెషల్ ప్యాకేజి కేంద్రం ఇస్తామంటే వెంటనే వారికి సన్మానాలు చేసింది టీడీపీ వాళ్ళు కాదా అని ప్రశ్నించారు. తాను ఆ నాదే వాటిని పాచిపోయిన లద్దూలుగా వ్యవహరించి వ్యతిరేకించానన్నారు. ప్రత్యేక హోదా అంశంపై నిలదీసిన మొట్ట మొదటి పార్టీ జనసేన మాత్రమే అని పవన్ అన్నారు. దానికోసమే ప్రజలతో ఈ విధంగా జనేసేన కవాతు జరుపుతోందని,ప్రజలు సంకల్పంతో ఉంటే ప్రత్యేక హోదా కష్టం కాదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డ పవన్, అధికారంలో ఉండి ఒక్క వర్గానికో, కుటుంబానికో మేలు చేయకూడదని, ప్రజాస్వామ్యంలో అందరం సమానమని నమ్ముతానని అన్నారు. తాను వచ్చే ఎన్నికలలో గెలుస్తానో లేదో తెలియదు గాని మిగతా వాళ్ళ లాగా మోసం చేయనన్నారు.

ఇంకా మాట్లాడుతూ పుష్కరాలకు 2వేల కోట్లు ఖర్చు చేశారు. విదేశీ పర్యటనలకు టీడీపీ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ కిడ్నీ రోగులకు మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. సోంపేటలో రొయ్యల చెరువు పేరుతో కాలుష్యం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లోనూ మొండిచేయి చూపారు. నేను మాత్రం సమస్యల మీద నిజాయితీగా మాట్లాడుతా, పోరాడుతా. ఇప్పటికీ శ్రీకాకుళం ఇంకా వెనుకబడి ఉంది. కిడ్నీ రోగుల కోసం హార్వర్డ్ యూనివర్సిటీ వైద్యులను తీసుకొస్తే ఆ నివేదికను పక్కన పడేసారు. ఇష్టానికి మమ్మల్ని బెదిరిస్తే తిప్పికొడతాం. 3లక్షల మంది మత్స్యకారుల జీవితాలు అగమ్యగోచరంగా ఉన్నాయంటూ’ పవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

తాము కచ్చితంగా మొత్తం 175 స్థానాలలో పోటీ చేస్తామని ,ఎవ్వరికీ భయపడేది లేదన్నారు . తనను వెనక నుండి ఆడిస్తున్నారని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారని ఎవరో ఆడిస్తే ఆట బొమ్మను తాను కాదని,  భయపడే వ్యక్తిని కాదని అన్నారు. బీజేపీకి భయపడుతోంది తాను కాదని, సీఎం చంద్రబాబేనని, అసలు, ఆయన ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు. ‘చంద్రబాబు భయపడటానికి కారణం..ఓటుకు నోటు..లోగుట్టు పెరుమాళ్ల కెరుక’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీని మోసం చేసిన బీజేపీని టీడీపీ నిలదీయలేకపోయిందని, టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా వైసీపీ అసలు అసెంబ్లీ లో హాజరవ్వడంలేదని ప్రజాసమస్యల పోరాట క్షేత్రంలో ప్రతిపక్షం వైఫల్యం చెందిందని, ‘హోదా’సాధన కోసం ఇటీవల చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్ష.. ధర్మపోరాట దీక్షపై ఆయన విమర్శలు గుప్పించారు. ధర్మ పోరాటం అంటే తమ లాగా జనం లోకి వచ్చి చేయాలని ఎక్కడో టెంట్ల కింద కూర్చొని చెమట పట్టకున్డ్డ చేయడం కాదని విమర్శించారు. ‘ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. మీరో వైపు.. నేనో వైపు కూర్చుందాం..ప్రత్యేకహోదాపై ధర్మాపోరాటం ఎవరిదో ప్రజలే తేలుస్తారు’ అని పవన్ కల్యాణ్ అన్నారు.

తనకు వెంటనే ముఖ్యమంత్రిని అవ్వాలని లేదని,ముందు సమస్యలను అర్ధం చేసుకుని తరువాతే ముఖ్యమంత్రి అవుతానని అన్నారు. తన సభల్లో సీఎం సీఎం అని అరిస్తే సరిపోదని దానికి చాలా కష్టపడవలసి వస్తుందన్నారు. తనని సీఎం గా చూడాలనుకుంటే తమ వోటుతో వచ్చే ఎన్నికలలో మద్దతు పలకాలని అన్నారు. తాను ఒకవేళ అధికారంలోకి వస్తే అగ్రిగోల్ద్ లెక్కలన్నీ ప్రజల ముందు పెదతానని,తాను మిగతా రాజకీయ పార్తీలలాగా ప్రజల సొమ్ముతో తమ సంతానాన్ని పోషించే వాడిని కాదన్నారు . తనది సొంత వ్యాపారం కోసం ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేసేంత స్వార్ధపూరితమైన కాదన్నారు . తాను కచ్చితంగా ప్రజా సమస్యలపై పోరాదతానన్నారు. తాము  నోట్లతో కొనే ప్రభుత్వం కాదని,ప్రభుత్వం ఏర్పరిస్తే అది కచ్చితంగా మనసులతోనే గెలుచుకొనేది అయ్యి ఉంటుందన్నారు. తాను మళ్ళీ ఆగష్టు లో ఇచ్చాపురానికి వచ్చి ఇప్పుడు తెలుసుకున్న సమస్యలకు పరిష్కారం చెప్తానన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments