కింగ్ అక్కినేని నాగార్జున,న్యాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలలో  శ్రీరామ్ ఆదిత్య దర్సకత్వం లో మల్టీస్టారర్ సినిమా చేస్తున్న విషయం తెలిసినదే . అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని డాక్టర్ గా నటిస్తుండగా,నాగార్జున డాన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగ్ సరసన మళ్ళీరావా ఫేం ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా,నాని సరసన చలో ఫేం రష్మిక మండన హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ చిత్రం గురుంచి ఒక వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఈ చిత్రాన్ని వినాయక చవితి ముందు రోజు అంటే సెప్టెంబర్ 12 వ తారీఖున విడుదల చేయనున్నారట. ప్రస్తుతానికి సెప్టెంబర్ బరిలో స్టార్ హీరోల సినిమాలేవీ లేకపోవడంతో ఆ సమయంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments