మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన విధుల నుండి రిటైర్మెంట్ తీసుకొని ప్రజల సమస్యల మీద దృష్టిపెట్టారు. అనంతరం ఆయన శ్రీకాకుళం పర్యటన చేసి అక్కడ ఒక గ్రామాన్ని కూడా దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రకాశం జిల్లా పర్యటన షెడ్యూల్ ప్రకటించారు.

22-05-2018

ఉదయం 10 గంటలకు cs పురం చేరుకొని అక్కడ ఉన్న రైతులతో,గ్రామస్థులతో ఫ్లోరైడ్ సమస్యలపై చర్చిస్తారు. తదుపరి సాయంత్రం 4 గంటలకు త్రిపురాంతకం గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్న దేవాలయాలను దర్శించుకొని రైతులతో సమావేశమవుతారు . అనంతరం రైతులతో సహపంక్తి భోజనం చేసి రాత్రికి అక్కడే బస చేస్తారు.

23-05-2018

ఉదయం 8 గంటలకు త్రిపురాంతకం నుండి వెలిగొండ గ్రామానికి బయలుదేరి 10 గంటలకు వెలిగొండ ప్రాజెక్ట్ సమస్యలపై గ్రామీణులతో చర్చిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు వెలిగొండ డ్యాం ను సందర్శిస్తారు. తరువాత అక్కడ నుండి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు పుల్లెలచెరువు గ్రామానికి చేరుకుంటారు. 3 గంటల 30 నిమిషాలకు గారపెంట చేరుకొని అక్కడి గిరిజనులతో ,వారి సమస్యల గురుంచి చర్చిస్తారు. అక్కడినుంచి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు తిరిగి పుల్లెలచెరువు గ్రామానికి చేరుకొని అక్కడి గ్రామస్థులతో,రైతులతో సమావేశమయ్యి రాత్రికి ఆకక్డే బస చేస్తారు.

24-05-2018

పుల్లెలచెరువు నుండి ఉదయం 8 గంటలకు అద్దంకి పట్టణానికి బయలుదేరుతారు,ఉదయం 10 గంటలకు అద్దంకి చేరుకొని చుట్టుపక్కల గ్రామాల్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు పిచుకుల గుడిపాడు(పి.గుడిపాడు) గ్రామాన్ని సందర్శించి గ్రామీణులతో మరియు రైతులతో సమావేశమవుతారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు బొబ్బెపల్లి గ్రామం చేరుకొని అక్కడి రైతులతో నర్సరీ మొక్కలు వాణిజ్య సాగుపై చర్చించి ఆరోజు రాత్రి అక్కడే బస చేస్తారు .

మరుసటి రోజు ఉదయం హైదరాబాద్ కు తిరిగి ప్రయాణమవుతారు

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments