జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నుండి బస్సు యాత్ర ప్రారంబించబోతున్నారు. ఉత్తరాంధ్ర మొత్తం 45 రోజులపాటు అన్ని జిలల్లాలోని నియోజికవార్గాలను కలుపుతూ పర్యటన ఉండనుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మూడు  అంశాల ప్రస్తావన జరగనున్నాయ్.

మొదటిది  ఉత్తరాంధ్ర లో యువత నిరుద్యోగులై కసిగా ఉండడం,వారు ఉన్న చోట సరైన విద్య,ఉపాధి అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్,బెంగళూరు,ఒరిస్సా వంటి వేరే ప్రదేశాలు వెళ్ళ వలసిన పరిస్థితి నెలకొన్న నేపధ్యంలో యువత తో కవాతు చేయించడం తద్వారా ఆవేశపూరితంగా వారిని మార్గనిర్దేశం చేసి వారి ముఖ్యమైన సమస్యలను హైలైట్ చేయడం,వారికి పరిష్కారం పై భరోసా కల్పించడం.

రెండోవది దిగువ మధ్య తరగతి ప్రజలతో మమేకం అవ్వడం, వారి సమస్యలను తెలుసుకొని వాటిపై అధ్యయనం చేయడం, ముఖ్యంగా వారికి సరైన పౌష్టికాహారలోపం వల్ల వారికి వచ్చే ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఉద్దానం వంటి సమస్యలను హైలైట్ చేయడం,వాటి పరిష్కారాల మార్గాలు అన్వేషించడం, వారికొక పెద్ద భరోసా గా సమస్యల పరిష్కారానికి నిలబదబం వంటివి .

మూడవది రైతాంగం గో చర్చిండం,వారి గిట్టుబాటు ధరపై అధ్యయనం చేయడం. కూలీదారుల పెరుగుదల వాళ్ళ ఖర్చు పెరిగిపోవడంతో గిట్టు బాట లభించకపోవడం,వారి పరిష్కారాల పై చర్చించటం,ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడం.

రైతుల గిట్టుబాటు ధరల విషయంలో ముఖ్యంగా కూలీల వ్యవస్థ పెరిగిపోవడమే ప్రధానమైన కారణం . ఉపాధి హామీ పధకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా పరిష్కారం చూపించొచ్చు. కాని అలాచేస్తే కూలీల ఓట్లు పోయే అవకాశం ఉన్నందున ఇప్పడివరకూ ఏ ప్రభుత్వం కూడా ఈ చర్యలు తీసుకోలేదు. మరి పవన్ ఈ విషయంలో ఎలా వ్యవహరిస్తారో చూడాలి.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments