జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర మొదలయ్యింది. ఆయన ఇచ్చాపురం లోని కవిటి మండలం లో సాగరతీరానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న గంగపుత్ర మహిళలు ఆయనకు హారతితో స్వాగతం పలికారు. పవన్ సముద్రస్నానం చేసి  గంగాపుత్రులతో కలిసి సాగర తీరాన గంగపూజ చేసి . అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ప్రజల కష్టాలు తెలియాలన్నారు. జనసేన పార్టీ అన్ని సంస్కృతులను గౌరవించే పార్టీ అని,మిగతా పార్తీలలలాగా తాము కులాలను విడదీయమని ఇదే జనసేన సిద్దాన్తమన్నారు.

పెద్దల ఆశీసులతో, యువత మద్దతుతో, అక్క చెల్లెళ్ళ తోడుతో 2019లో కచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం అని వ్యాఖ్యానించారు. కిడ్నీ సమస్యకు సంబంధించి చిన్న కదలికైతే మొదలయ్యింది కాని తను హార్వార్డ్ నుంచి స్పెషలిస్ట్లను తీసుకోచ్చాని,వారు సేవచేస్తామని ముందుకు వచ్చినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదో తనకింకా అర్ధంకాలేదని,ఇప్పటికైనా ప్రభుత్వం తనకు సమాధానం చెప్పాలని వేడుకుంటున్నానన్నారు. అక్కడ ఉన్నవారు సీఎం సీఎం అని నినాదించగా పవన్ మాట్లాడుతూ పదవి ఇవన్నీ తేలిక కాదు బాధ్యతని,తాను ఎప్పుడు పదవులు ఆశించలేదని పని చేయడానికి ఇష్టపడ్డానన్నారు. ఉద్దానం సమస్యను అంతర్జాతీయ స్థాయి దృష్టి కి తీసుకువెళ్ళి విదేశ,దేశ శాస్త్రవేత్తలతో పాటు కూర్చొని దీనికి సమూలమైన శాశ్వత పరిష్కారం పై చర్చిస్తున్నామన్నారు. వెనకబడ్డ,గిరిజన ప్రాంత సమస్యలు తనకు బాగా తెలుసని,ఇంకా అవగాహన పెంచుకోవడానికి మాత్రమే ఈ పర్యటన అని అన్నారు. మూడు నెలల తరువాత మళ్ళీ పర్యటించినప్పుడు ఈ సమస్యలకు పరిష్కారాలు చెప్తానని,ఈ లోపల ఈ సమస్యలను తెలుసుకొని ఉద్దానం పై ఏ విధంగా కృషి చేసామో అలా ప్రతీ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం తెలిచేస్తామన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments