తిరుమల ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల ఉదంతం అందరికీ తెలిసినదే. ఈ విషయంపై ఏపీ బ్రహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య స్పందించారు. ఆయన మీడియా తో మాట్లాడుతూ రమణ దీక్షితులు ఒక దుర్మార్గుడని,దుష్టుడని అన్య మతస్తుల ఇళ్ళకు వెళ్లి పూజలు చేసి వచ్చిన చరిత్ర ఆయనదని మండిపడ్డారు. టీటీడీ పై రమణ దీక్షితులు చేస్తున్న విమర్సాలన్నీ అర్ధరహితమని అన్నారు. బీజేపీకి తొత్తుగా మారి అయన రాజకీయాలు చేయడం ప్రారంబించి,దైవసేవను మరచినందునే ఆయనకు తగిన శాస్తి జరిగిందన్నారు. ఆయన ఆరోపణలను పట్టించుకోనవసరం లేదని,ఆయన ఓ మహానటుడని,అర్చకులంతా ఆయనను వ్యతిరేకించారన్నారు. గత మూడేళ్ళుగా తిరుమల అర్చకులతో,ఈఓతో,ఉద్యోగులతో గొడవలు పెట్టుకున్నారని,నిత్యాన్నదాన పధకానికి వచ్చిన డబ్బును తన సొంత ఖాతా లోకి వేయించుకున్న ఘనుడు రమణ దీక్షితులని,విలువైన వస్తువులను ఆయన దొంగాలించారని ఆనంద్ సూర్య గుప్పించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments