కర్ణాటక రాజకీయం గత 3 రోజులుగా ఏవిధంగా మలుపులు తిరిగిందన్న విషయం తెలిసినదే . కర్నాట శాసనసభలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెడుతూ సంఖ్యాబలం కూడగట్టడంలో తాము విఫలమయ్యామని,అతి పెద్ద పార్టీగా నిలబడినా ప్రజలకు సేవచేసుకునే భాగ్యం తనకు లేదని,తమను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ భావోద్వేగానికి గురి అయ్యారు. బలపరీక్ష నిర్వహించకముందే  అసెంబ్లీ నుండి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసి తన రాజీనామాను సమర్పించారు. ఆయన కేవలం 55 గంటలు మాత్రమే కర్నాటకకు ముఖ్యమంత్రి గా వ్యవహరించారు. ఈ పరిణామంతో జేడీఎస్,కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ప్రజాస్వామ్యం నిజంగా ఇప్పుడు గెలిచిందని వారు వ్యాఖానిస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments