బీజేపీకి సరైన సంఖ్యా బలం లేకపోయినా యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం,దానితో కాంగ్రెస్,జేడీఎస్ సుప్రీంకోర్టు కు వెళ్ళడం,సుప్రీమ్ కోర్టు శనివారం సాయంత్రం 4 గంటలకు కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప బలపరీక్షలో తమ బలం నిరూపించుకోవాలనడం తెలిసినదే. అయితే ఇప్పుడు కర్ణాటక శాసనసభలో యడ్యూరప్ప విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా భావోద్వేగంతో ప్రసంగం చేసారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ దుష్పరిపాలనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారని,మోదీ పాలన మెచ్చి తమకు 104 సీట్లు గెలిపించారని,బీజేపీ కి మద్దతిచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాము సంఖ్యాబలం నిరూపించుకోవడంలో విఫలమయ్యామని,సింగల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగినా తమకు ప్రజాసేవ చేసుకునే భాగ్యం దక్కకపోవం దురదృష్టకరమని,ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా జేదేఎస్,కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు యత్నించడం బాధాకరమన్నారు. ఇంకా మాట్లాడుతూ సిద్దారామయ్య గత 5 ఏళ్ళల్లో ప్రజలకు ఉపయోగపడే పనులేమి చేయలేదని,రైతులకు సరైన న్యాయం చేయలేదని,కాంగ్రెస్ పాలనలో ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారన్నారు. తాము అధికారంలోకి వస్తే ప్రజల కన్నీళ్లు తుడుడ్డామనుకున్నాని, లక్షన్నర లోపు ఉన్న రైతులకు రుణమాఫీ చేద్దామనుకున్నాని,ఆదర్శ రాష్ట్రంగా కర్ణాటకను తీర్చి దిద్దుదామనుకున్నాని వాపోయారు.