2019 ఎన్నికలలో పాల్గోనడానికి పోరాట యాత్ర ప్రారంబిస్తానని పవన్ ప్రకటించిన నేపధ్యంలో ప్రముఖ నిర్మాత,దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ కొన్ని సూచనలు చేశారు. ఆయన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా స్పందిస్తూ యాత్రకు వెళ్ళే ముందు పవన్ తమ అజెండా గురించి తెలియజేయాలని,దాంతో పాటు ఎన్నికలలో నిలబెట్టేందుకు సరైన అభ్యర్ధులను ఇప్పుడే ఎంపిక చేసుకోవాలన్నారు. ఇంకా మాట్లాడుతూ పవన్ 175 నియోజికవర్గాలలో పర్యటించి,ఊరూరా తిరుగుతూ నీతినిజాయితి గల యువతనుంచి అభ్యర్ధులను ఎంపిక చేసుకోవాలని,ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పడు కూడా అలాగే చేసారని,వారంతా అన్నగారు ఉన్నంతవరకూ నిబద్దతతో ఉన్నారన్నారు. తన చుట్టూ ఉన్న కోటరీకి ప్రాధాన్యం ఇవ్వడం వాళ్ళ ప్రయోజనం ఉండదన్నారు.

ఆ క్రెడిట్ నాదే…

పవన్ రాజకీయ క్రెడిట్ తనదేనని తమ్మారెడ్డి అన్నారు. తాను బయటికి వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని గతంలో పవన్ అన్నప్పుడు,తాను స్పందించి ప్రాబ్లం వచ్చినా సరే మీరు జనంలోకి వెళ్లాలని సూచించానని,తన సూచనను పవన్ పాటించారో లేదో తెలియదు గాని ఆయన జనంలోకి వెళ్తున్నందుకు ఆనందంగా ఉందని ఆ క్రెడిట్ మాత్రం తానే తీసుకుంటానని తమ్మారెడ్డి అన్నారు.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments