తన కామెడీ టైమింగ్ తో అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులచేత మంచి కమెడియన్ గా మన్ననలు అందుకున్నారు సునీల్. ఆ తరువాత హీరో గా మారి సినిమాలు చేస్తున్నారు. కాని హీరోగా అనుకున్నంతగా రాణించలేకపోవడంతో మళ్ళీ కమెడియన్ గా మారాలనే యోచనలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఒక యువ హీరోతో మల్టీస్టారర్‌కు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే భీమినేని శ్రీనివాసరావు దర్సకత్వంలో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా మరో యంగ్ హీరోతో నటించేందుకు సునీల్ ఓకే చెప్పారు,శర్వానంద్,హను రాఘవాపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న పడి పడి లేచే మనసు చిత్రం లో సునీల్ కీలక పాత్రలో నటించబోతున్నారు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సునీల్ నటించనున్నారు.
Subscribe
Login
0 Comments