కర్ణాటక రాజకీయాలు దేశంలోనే హాట్ టాపిక్ గా నిలిచాయి. నిమిషానికొక మలుపు తిరుగుతూ ఆశక్తిని పెంచుతున్నాయ్. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ నేతలు,సాక్షాత్తు యడ్యూరప్ప కొనుగోలు చేయడానికి ప్రయత్నించిన ఆడియోలు బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి నరెంద్రమోదీ ను ఉద్దేశించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దారామయ్య త్వీట్ చేసారు. అవినీతి గురించి అలుపెరగకుండా ప్రసంగించడంలో మోదీ సిద్ధహస్తుడని,కానీ ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్నది ఏమిటని ప్రశ్నించారు. యడ్యూరప్పను,బీజేపీ నేతలను ఎమ్మెల్యేలను కొనుగోలు చేయకుండా నిలువరించే నైతిక విలువలు మోదీకి ఉన్నాయా,కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక సుస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిష్టారా అని ప్రశ్నించారు.