ఒక అసమర్దుడిగా పరారయ్యారు…

0
312

కర్ణాటక అసెంబ్లీలో జరిగిన పరిణామాలు,యడ్యూరప్ప రాజీనామా గురుంచి కాంగ్రెస్ నేత,ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటామని చెప్పుకున్న బీజేపీ నేత యడ్యూరప్ప ఒక అసమర్దుడిలా అసెంబ్లీ నుండి పరారయ్యారని,ఇది ప్రజాస్వామ్య విజయమని అన్నారు. సంఖ్యాబలం లేని యద్యూరప్పను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడమేనని,బీజేపీ నేతలు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని మండిపడ్డారు. తాము కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలను సంప్రదించిన విషయం నిజమేనని యడ్యూరప్ప ఒప్పుకున్నారని,ఎమ్మెల్యేల కొనుగోలుకు గవర్నర్ ప్రోత్సాహించారని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here