రమణ దీక్షితులు మరియు ఇతర అర్చకుల విషయంలో టీటీడీ పాలకమండలి అనుసరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయం పై తెలంగాణ అర్చక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు,చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ మండిపడ్డారు. ఏపీ సీఎం కుమారుడు లోకేష్ కు ఏమి అర్హత ఉందని మంత్రిని చేసారని ప్రశ్నించారు. టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు పై వేతును తీవ్రంగా ఖండిస్తున్నామని,టీటీడీ పాలకమండలికి చట్టాలపై అవగాహన లేదని,తిరుమలపై ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం చిన్న ఆలయాలపై పడుతుందన్న విషయాన్ని టీటీడీ గుర్తించాలన్నారు.
ఇంకా మాట్లాడుతూ ఎండోమెంట్ యాక్ట్ ని సవరించకుండా రిటైర్మెంట్ చేయడానికి వీలులేదని,ధార్మిక పరిషత్ ఇచ్చిన రిజల్యూషన్ ను ట్రస్టు బోఅర్డు కొట్టేయడానికి వీలులేదన్నారు. వంశ పారంపర్యంగా తండ్రి తరువాత కొడుకు అర్చకత్వం చేయకూడదని చెబుతున్న చంద్రబాబు ఆయన కొడుకుని మాత్రం వారసత్వంగా రాజకీయాల్లోకి తీసుకొచ్చారని మంది పడ్డారు. అర్చక వ్యవహారాల్లో మీరు వెలి పెట్టారు కాబట్టి మేము మిమ్మల్ని మీకు రాజకీయమెందుకని అడుగుతాం. రాజకీయ నాయకుడు మా దగ్గరకొస్తే మేం రాజకీయ నాయకుడి దగ్గరకోస్తాం అని వ్యాఖానించారు.