తెలుగు మల్టీస్టారర్ లో రకుల్…

0
323

అతితక్కువ సమయంలోనే తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకున్నారు రకుల్. ఆమె తమిళ్ సినిమాలలో బిజీగా ఉండడం వల్ల స్పైడర్ సినిమా తరువాత తెలుగు సినిమాలో నటించలేదు. ఇప్పుడు మళ్ళీ ఒక మల్టీస్టారర్ ద్వారా తెలుగులో నటించేందుకు సిద్ధమయ్యారు. బాబీ దర్సకత్వంలో నాగచైతన్య,వెంకటేష్ ప్రధాన పాత్రలుగా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న చిత్రం లో నాగచైతన్య కు జోడీగా రకుల్ ఎంపికయ్యారు. రకుల్,చైతు కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ప్రస్తుతానికి వెంకటేష్,నాగచైతన్య వేరే సినిమాలలో బిజీగా ఉన్నారు,వాళ్ళ షూటింగ్ అయిపోయిన వెంటనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్,పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here