సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది . హీరో ధనుష్ ఈ చిత్రాన్ని నిర్మించగా పా రంజిత్ దర్సకత్వం వహించారు. హయో ఖురేషి,అంజలీ పాటిల్ ఈ చిత్రంలో కధానాయికలు గా నటించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తమ అనుభవాలను చిత్రబృండం చెప్పుకొచ్చింది. ఈ చిత్రం లో ఒక రైన్ ఫైట్ సీక్వెన్స్ ఉందని,ఆ సీక్వెన్స్ చిత్రీకరణ 5 రోజాల పాటు జరిగిందని,అప్పుడు రజనీ డెడికేషన్ చూసి ఆశ్చర్యపోయామన్నారు. షాట్ చేసి వచ్చి రజనీ అలాగే తడి బట్టలతో ఏదైనా బుక్ చదువుతూ ఉండేవారని,నెక్స్ట్ షాట్ వరకు కొంచెం డ్రై అవ్వండి అంటే మళ్ళీ ఎలాగూ తడవాలి కదా ఎం ఫర్లేదు అనే నవ్వేవారని చెప్పారు. ఇంకా చిత్రబృండం మాట్లాడుతూ రజనీ ప్రతీ సినిమాను తన ఫస్ట్ సినిమాలాగా ట్రీట్ చేస్తుంటారని,తన కంఫర్ట్ జోన్లో నుంచి బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉంటారాన్నారు. సూపర్ స్టార్ తలచుకుంటే సీన్ తనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు,కానీ అలా ఒప్పుకోరు,సీన్ డిమాండ్ తగ్గట్టుగానే రజనీ తనని అడాప్ట్ చేస్తుకుంటారు.ఆయన అలా ఉండడం వల్ల టీం లో ఉన్న అందరికి బూస్ట్ లా అనిపించిందన్నారు. కాలా సినిమా జూన్ 7 రిలీజ్ కానుంది.
Subscribe
Login
0 Comments