కర్ణాటక రాజకీయ పరిణామాలు,యడ్యూరప్ప రాజీనామాలపై కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని,కర్ణాటక పరిణామాలు బీజేపీ,ఆర్ఎస్ఎస్ కు ఒక గుణపాఠం అన్నారు. జాతీయ గీతం పాదకముందే స్పీకర్,బీజేపీ ఎమ్మెల్యేలు సభనుండి వెళ్లిపోయారని,బీజేపీ నేతలకు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అవినీతి పరుడని,ఎమ్మెల్యేల కొనుగోలును ఆయనే వ్యతిరేకించి,వాళ్ళ నేతలే కాంగ్రెస్,జేడీఎస్ నేతలను కొనడానికి ప్రయత్నించారని విమర్శించారు. తమకు సంఖ్యాబలం లేకపోయినా అధికారం కోసం అడ్డదారులు తొక్కి ప్రజాతీర్పును బీజేపీ నేతలు అపహాస్యం చేశారన్నారు. అధికారం కోసం మరీ హద్దు మీరి ప్రవర్తిస్తున్నారని, కర్ణాటక నుండి వారు బుద్ధి తెచ్చుకోవాలని,ప్రతీ వ్యవస్థను అగౌరవపరిచేలా బీజేపీ వ్యవహరిస్తోంది అనడానికి ఇదే నిదర్శనామని,బీజేపీ అరాచాకాలను అడ్డుకొని తాము ప్రజలకు అండగా ఉంటామన్నారు.