క్యూబాలో ఘోర విమాన ప్రమాదం…

0
222

క్యూబాలో శుక్రవారం ఘోర విమాన ప్రమాదం  చోటుచేసుకుంది. ప్రభుత్వ విమానయాన సంస్థ క్యూబానాకు చెందిన ఓ విమానం రాజధాని హవానాలోని జోస్‌ మార్టి విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ తీసుకున్న కొద్దిసేపటికే కూలిపోయింది. ప్రమాదం సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉండగా ఎంతమంది మరణించిందీ కచ్చితంగా తెలియరాలేదు. బోయింగ్‌ 737 మోడల్ విమానం హవానా నుంచి హోల్గ్యిన్‌ పట్టణానికి వెళ్తుండగా హవానాకు దగ్గర్లోని పంట పొలాల్లో కూలిపోయింది. ప్రమాదం వల్ల దట్టమైన పొగ కమ్ముకున్న ఆ ప్రాంతానికి సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్‌ డియాజ్‌–కేనెల్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించి,ఎక్కువ సంఖ్యలో మరణించారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here