మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్సకత్వంలో, హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మాతగా,ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి “అరవింద సమేత వీరరాఘవ” పేరు పెట్టారు. ఈ టైటిల్ ను చూస్తుంటే కొత్తగా,దేవాలయాల్లో దేవుళ్ళ పెర్లలోలాగా సమేత పదం వాడడం చాలా ఆకర్షణీయంగా ఉంది,త్రివిక్రమ్ మార్క్ టైటిల్ అని కూడా చెప్పవోచ్చు, ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టుకుంటున్న ఈ తరుణంలో ఇలా స్వచ్చమైన తెలుగు టైటిల్ ను పెట్టడం చాలా ఆనందానిచ్చిందని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు.

ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ విషయానికొస్తే పోస్టర్ లో ఎన్టీఆర్ చాలా కోపంగా,సిక్స్ ప్యాక్ బాడీతో కనిపిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఇతర దేశం నుండి ట్రైనర్ ను తెప్పించుకొని తన దేహాన్ని మలిచారు. కాళ్ళకి రక్తం అంటుకొని ఉండడం,ఎన్టీఆర్ చూపు చూస్తుంటే ఇది పోరాట సన్నివేశం అని తెలుస్తోంది. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఉన్న సినిమా కాబట్టి ఎక్కువ పోరాట సన్నివేశాలు ఉండవోచ్చని సినీ ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ చిత్రం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీత దర్సకత్వం చేస్తున్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments