ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతున విషయం తెలిసదే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ గురుంచి చాలా రోజులుగా ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారనే ఉత్సుకత అందరిలో పెరిగిపోతోంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు సంబంధించి సోషల్ మీడియా ద్వారా చిత్రబృందం తెలియజేసింది. మే 20 వ తారీఖున ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 19 శనివారం సాయంత్రం 5 గం 40 నిమిషాలకు ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా రెవీల్ చేస్తామని చిత్రబృందం పేర్కొంది. తమ ట్విట్టర్ ఖాతా ద్వారా  “రెడీగా ఉండండి.. ఇంతకు ముందెన్నడూ చూడని ఎన్టీఆర్‌ను మీకు చూపించబోతున్నాం. త్రివిక్రమ్ సెల్యూలాయిడ్ మీ వైపు దూసుకొస్తుంది’’” అంటూ చిత్ర బృందం ట్వీట్ చేసింది

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments