మజ్జిగ తాగండి…ఫోన్ గెలవండి…

0
378

జయేంద్ర దర్సక్వంలో నందమూరి కళ్యాణ్ రామ్,తమన్నా జంటగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో బ్రీజ్ సినీమాస్ పతాకం పై తెరకెక్కిన సినిమా నా నువ్వే .మే 25 వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రోమోషన్స్ లో భాగంగా చిత్రబృందం ఒక వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టింది. మజ్జిగ తాగండి… రూ. ౩౦ వేల రూపాయల ఫోన్ గెలుచుకొంది” అంటూ సినిమా ప్రచారం మొదలు పెట్టింది. నా నువ్వే పోస్టర్స్ తో ట్రక్ ఏర్పాటు చేసి హైదరాబాద్,విజయవాడ,వైజాగ్ నగరాల్లోన్ని వీధి వీధి తిరుగుతూ చల్లని మజ్జిగను ఉచితంగా అందిస్తుందని,మజ్జిగతాగి ఆ ట్రక్ తో సేల్ఫీ దిగి చిత్రయూనిట్ కు పంపితే పంపిన వారిలో లక్కీ విన్నర్స్ ను సెలెక్ట్ చేసి ఐదుగురికి వన్ ప్లస్ 5 మొబైల్ ను అందించనున్నారు. మరో 20 మందికి సినిమా టికెట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రకటన జారీ చేశారు చిత్రయూనిట్ సభ్యులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here