నువ్వు చించేస్తావ్…

0
205

తెలుగు లో మొట్టమొదటి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1 ఎంత పెద్ద విజయం సాదించిందో తెలిసినదే. ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ షో అందరి నీరాజానాలు అందుకుని. అంతటి విజయం సాదించిన ఈ షో  రెండోవ సీజన్ త్వరలో మొదలుకానుంది. కాని ఈ సారి వ్యాఖ్యాత ఎన్టీఆర్ కాదు,ఆయన ప్లేస్ లోకి న్యాచురల్ స్టార్ నాని వచ్చి చేరారు. ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉండడంతో నాని ను హోస్ట్ గా సెలెక్ట్ చేసి అధికారికంగా ప్రోమో కూడా స్టార్ మా విడుదల చేసింది. ఇప్పటికే నాని కొన్ని సినిమాలలో వాయిస్ ఓవర్ ఇవ్వడంతో నాని ఈ షో లో వ్యాఖ్యాతగా రాణించగలరని అందరూ భావిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు కూడా నాని బిగ్ బాస్ హోస్ట్ గా సక్సెస్ అవుతారంటూ త్వీట్లు చేస్తున్నారు. తాజా మంచు లక్ష్మి ఈ విషయం పై స్పందిస్తూ ” వావ్.. ఎంతమంచి ప్రకటన. హోస్ట్ గా  నానిని ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నాని నువ్ చించేస్తావ్.. నాకు తెలుసు ” అని త్వీట్ చేసారు.

ఇందులో పాల్గొనే వ్యక్తుల గురుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఐస్‌క్రీమ్‌’ బ్యాటీ తేజ‌స్వి, గాయ‌ని గీతా మాధురి, సీనియ‌ర్ నటి రాశి, హీరోయిన్ గ‌జాలా, యాంకర్ శ్యామల ఉన్నారని మాత్రం ప్రచారం జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here