జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాను మే 20 వ తారీఖున ఇచ్చాపురం నుండి తన పోరాటయాత్ర మొదలుపెత్తనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యల పరిష్కారానికై ప్రయత్నిస్తామని పవన్ వెల్లడించారు. అయితే మొదటి రోజు షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఆదివారం మే 20 వ తారిఖు ఉదయం 6 గంటలకు బయలుదేరి ఇచ్చాపురం తీరంలోని కవిటి మండలం కపాసుకుద్దిలో స్థానిక మత్స్యకారులతో కలిసి గంగాపూజలో పాల్గొని అనంతరం తిరిగి ఇచ్చాపురం చేరుకుంటారు. ఉదయం 8 గంటలకు స్వేచ్చావతి అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తారు. తిరిగి 9 గంటలకు అక్కడినుంచి రాజావారి మైదానం వరకు అభిమానులతో,కార్యకర్తలో కలిసి ప్రత్యేక హోదా నిరసన కవాతును నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు రాజావారి మైదానంలో బహిరంగసభలో పాల్గొని అక్కడినుండి 12 గంటలకు బస్సు యాత్ర మొదలుపెడతారు. లోద్దపుట్టి,ఇన్నేసుపేట,ధర్మవరం,కొఠారి,ఈడుపురం మీదుగా కవిటి మండలం చేరుకుంటారు. అక్కడినుంచి కొత్త శ్రీరాంపురం మీదుగా కంచిలి,సోంపేట,బారువ కూడలి వరకూ మొదటి రోజు  బస్సు యాత్ర సాగుతుంది. మార్గ మధ్యంలో పలు కూడళ్ళలో పవన్ ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments