జనసేన పార్టీ బలోపేతం అయ్యే దిశగా పయనిస్తోంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రముఖ రాజకీయ వేత్త,మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ ను నియమించినట్టు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మీడియా ముఖంగా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా చంద్రశేఖర్ గారితో తనకు వ్యక్తిగత సాన్నిహిత్యం ఉందని,ఆయనలో మంచి పరిపాలనాదక్షుడే కాకుండా విజయవంతమైన పారిశ్రామికవేత్త కూడా అని తెలిపారు.

ఇంకా మాట్లాడుతూ పౌర పాలనలో చంద్రశేఖర్ గారికి ఉన్న పట్టు,శక్తీసామర్ధ్యాలు అపారమైనవని,ఆయన దీక్షాదక్షత పార్టీని మరింత విస్తృత పరచడానికి ఉపయోగపడుతుందన్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ త్వరలోనే ప్రమాణస్వీకారం చేస్తారని,ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహిస్తామని,ఆయనకు పార్టీ శ్రేణులు సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments