కర్ణాటకలో బీజేపీ దారుణంగా వ్యవహరిస్తోంది…

0
235

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. కర్నాటకలో పరిస్థితి దారుణంగా ఉందని,బీజేపీ అప్రజాస్వామికమైన విధానాలను అనుసరిస్తున్నారని విమర్శించారు. మెజారిటీ లేకున్నా అధికారాన్ని చేజిచ్చుకునేందుకు బీజేపీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. గతంలో తమిళనాడు లో రాజకీయ సంక్షోబం తలెత్తిన సమయంలో కూడా బీజేపీ అదేవిధంగా ప్రవర్తించిందని,ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల విమానాన్ని అడ్డుకోవడంలో వారి ఉద్దేశం తెలుస్తోందని,వాళ్ళ కన్ను ఆంధ్ర మీద పడిందన్నారు. మోడీ-అమిత్ షా ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు? అని ప్రశ్నించారు.  శాంతిభద్రతల విషయంలో కుట్రలు చేయదలచుకున్నవారిని మక్కెలిరగ్గొడతానని చంద్రబాబు తీవ్రంగా హెచ్చరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here