గత ౩ రోజులుగా కర్ణాటక మారుతున్న రాజకీయాలు దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో నిన్న గాలి జనార్ధన రెడ్డి ఒక కాంగ్రెస్ ఎమెల్యే ను తమకు మద్దతిస్తే లైఫ్ సెటిల్ చేస్తానని ప్రలోభపెట్టిన ఆడియో ను కాంగ్రెస్ నేత విడుదల చేసారు. ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది, అది ఏంటంటే ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ప్రలోభాలకు పాల్పడ్డారాని,తమ ఎమ్మెల్యేలకు 5 కోట్ల రూపాయలు,మంత్రి పదవి ఆఫర్ చేసారని,దీనికి సంబందించిన ఆడియో ను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాసేపట్లో శాసనసభలో బలపరీక్ష జరగనున్న నేపధ్యంలో ఈ ఆడియో సంచలనంగా మారింది.