ప్రపంచంలో అత్యంత పురాతనమైన దేవాలయంగా విరాజిల్లుతూ కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలల జరుగుతున్నా పరిణామాలు తెలిసినదే. ఆలయ వ్యవహారాలు సరిగా జగరగడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన రమణ దీక్షితులు పై 65 ఏళ్ళు నిండాయని తొలగించటం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయ్ . దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ద్వారా ఈ విధంగా స్పందిచారు. “అవినీతి – అక్రమాలు – ఆగమశాస్త్ర ఉల్లంఘనలను ప్రశ్నించిన కారణంగా టీటీడీ అర్చకులకు పదవీ విరమణ ప్రకటించడం సరైనది కాదు. ప్రధాన అర్చకుడు వెల్లడించిన విషయాలతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధనయావ అధికారదాహం మరోసారి వెల్లడైంది. అనువంశిక సేవకులుగా స్వామివారికి అన్ని కైంకర్యాలు నిర్వర్తించే హక్కు శక్తి ఉన్నంతకాలం ఆ అర్చకులకు ఉంటుంది. పదోన్నతితో కూడిన పే స్కేలు పదవి వదిలిపెట్టిన తర్వాత ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వనప్పుడు ఉద్యోగిగా పరిగణించనప్పుడు వారికి ప్రభుత్వం రిటైర్మెంట్ ప్రకటించడంలో అర్థం లేదు. దేవుని మీద భయం భక్తి లేనివారు కాబట్టే గుడిభూములను కాజేయాలని చూశారు. ఇప్పుడు ఆలయ అర్చకుల విషయంలోనూ దశాబ్దాలుగా ఏ పాలకుడూ చేయని పని చేస్తున్నారు. దేవుడి దయ ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం అధికారంలోకొస్తే దేవాలయాల్లో అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా చేస్తాం” అని పేర్కొన్నారు
Subscribe
Login
0 Comments