ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పామాయిల్,పొగాకు రైతులకు కనేదేశం మద్దతు ధర లభించటంలేదని వారి పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం తాను వచ్చి ధర్నా చేస్తే తప్ప ప్రభుత్వం మద్దతు ధర పెంచడంలేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ గురుంచి జగన్ మాట్లాడుతూ చంద్రబాబు వల్లే నిధులు రావడం లేదని,వ్యవస్థ మొత్తం అవినీతిమయమైపోయిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులు రోజుకు 22 క్యూబిక్ కిలోమీటర్ల మేరకు జరుగుతున్నాయని,అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ పనులు రోజుకు 3 క్యూబిక్ కిలోమీటర్లు కూడా జరగడంలేదని విమర్శించారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments