వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్సకత్వంలో రూపొందిన చిత్రం ఆఫీసర్ . ఈ సినిమా కథ తనదేనంటూ జయకుమార్ ఆరోపించిన విషయం తెలిసినదే. ఇదివరకు వేరే సినిమా విషయంలో కూడా తన కదా కాపీ కొట్టారంటూ ఆరోపించారు.
అయితే జయకుమార్ తన ట్విట్టర్ ఖాతాలో “నాగార్జున గారు…మీరు సదరు డైరెక్టర్ గారికి బ్రేక్ ఇచ్చారు. కానీ ఆయన కొత్త వాళ్ళ కెరీర్ ను బ్రేక్ చేస్తున్నాడు. దయచేసి న్యాయం చేయండి” అంటూ పోస్ట్ చేసాడు. అలాగే తాను రాసిన ఆఫీసర్ స్క్రిప్ట్ ను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.