కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత రాజకీయం అనూహ్య పరిణామాలతో సాగుతోంది. సరిపడా మెజారిటీ లేకపోయినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే 15 రోజులలోగా శాసనసభలో బలనిరూపన చేసుకోవాలని గవర్నర్ ఆదేశించిన విషయం తెలిసినదే. అయితే ఈ విషయం పై కాంగ్రెస్ పార్టీ సుప్రీమ్ కోర్టుకు వెళ్ళింది,బలపరీక్షకు ఎక్కువ సమయం ఇస్తే తమ ఎమ్మెల్యేలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పరీ కోర్టుకు విన్నవించుకుంది. దానికి ప్రతిచర్యగా సుప్రీమ్ కోర్టు తీర్పును వెల్లడించింది. ఎక్కువ. సమయం ఇస్తే ఎమ్మెల్యేలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున యడ్యూరప్ప శనివారం సాయంత్రం 4 గంటలకు బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది.బీజేపీ తరపు న్యాయవాది రోహిత్గీ తమకు ఒక వారం సమయం కావాలని కోరగా సుప్రీంకోర్టు విజ్ఞాపనను తిరస్కరించింది.
బీజేపీ కి సుప్రీమ్ కోర్ట్ షాక్…
Subscribe
Login
0 Comments