జనసేన అధినేత ఇప్పుడు విశాఖపట్నం టూర్లో ఉన్న విషయం తెలిసినదే. ఈ రోజు ఆయన గంగవరం పోర్టును సందర్శించి అక్కడి నిర్వాసితులను కలిశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అవకాశమిస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని అందిస్తానన్నారు. సీఎం అని నినాదాలు చేసినంత మాత్రాన తాను సీఎం కాలేనని,ప్రజల సమస్యలు అర్ధం చేసుకున్న తరువాత ముఖ్యమంత్రి అవుతానన్నారు. నేతల యొక్క స్వార్ధం కోసం,కుటుంబాల కోసం ప్రభుత్వం పనిచేయరాదని,ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోరాదన్నారు. పవన్ మాట్లాడుతూ టీడీపీ,బీజేపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చనందునే తాను ప్రజల్లోకి వచ్చానన్నారు. తాను బాధ్యతలనుండి పారిపోయే వ్యక్తి కాదన్నారు.