కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో అనేకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.బీజేపీ కి సంఖ్యా బలం కావలసిన దానికంటే తక్కువగా ఉన్నా ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఆహ్వానించి 15 రోజులలోగా శాసనసభ లో బాల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ చెప్పారు. ఈ పరిస్థితులలో బీజేపీ జేడీఎస్,కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకని కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ తమ 76 మంది ఎమ్మెల్యేలను నిన్న రాత్రి హైదరాబాద్ కు తరలించి కాంగ్రెస్ నేత అయిన టి.సుబ్బిరామిరెడ్డి కి చెందిన పార్క్ హయత్ లో మకాం ఏర్పాటు చేశారు. ముందుగానే సమాచారం ఉండడంతో అక్కడ పోలీసు బందోబస్తు పెంచారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్,రాజశేఖర్ పాటిల్ ప్లేటు ఫిరాయించినట్టు తెలుస్తోంది. కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ ప్రవర్తనకు నిరసనగా నేడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసినదే.
హైదరాబాద్ కు కర్ణాటక కాంగ్రెస్…
Subscribe
Login
0 Comments