కర్ణాటక ప్రోటెం స్పీకర్ నియామకం…

567

కర్ణాటక అసెంబ్లీ ప్రొటెమ్ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే కేజే బొపయ్యను ఎంపిక చేశారు. అంతకుముందు, న్యాయ నిపుణులతో కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ చర్చించారు. ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమిస్తూ గవర్నర్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో ప్రొటెం స్పీకర్ గా బోపయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, అసెంబ్లీ స్పీకర్ గా బోపయ్య గతంల పనిచేశారు. విరాజ్ పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇదిలా ఉండగా, ప్రొటెం స్పీకర్ గా బోపయ్యను నియమించడంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది.ఎక్కువ సీనియార్టి ఉన్న తమ ఎమ్మెల్యే  దేశ్ పాండేను నియమించకుండా బోపయ్యను నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు.

కాగా, రేపు సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ విశ్వాస పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీం కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ విశ్వాస పరీక్షను ప్రొటెం స్పీకర్ బోపయ్య నిర్వహించనున్నారు. బీజేపీ సంఖ్యాబలం 104 కాగా, కాంగ్రెస్ కు78, జేడీఎస్ 36, ఇతరులు 3గా ఉంది. బలపరీక్ష గట్టెక్కేందుకు బీజేపీకి కావాల్సిన సంఖ్యాబలం 111. బీజేపీకి ఉన్న 104 మంది ఎమ్మెల్యేలతోనే బలపరీక్షలో నెగ్గాలంటే 14 మంది విపక్ష ఎమ్మెల్యేలు గైర్హాజరు కావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here