హరీష్ శంకర్,షాక్ సినిమాతో తన ప్రస్థానం మొదలుపెట్టినా పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో స్టార్ డైరెక్టర్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు సంబంధించి ఒక విషయం వైరల్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకోడానికి రైతు బంధు కార్యక్రమం చేస్తున్న విషయం తెలిసినదే.ఆ కార్యక్రమంలో భాగంగా కమ్మదనం గ్రామంలో హరీష్ శంకర్ కు ఉన్న భూమికి కూడా డబ్బులు మంజూరు చేశారు. అయితే హరీష్ తమకు ఆ ఫలం వద్దని,ఎవరైనా పేదరైతులు ఉంటే వారికే ఉపయోగించమని తిరస్కరించారు. ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో హరీష్ శంకర్ కు అభినందనలు అందుతున్నాయి. ఈ విషయాన్ని ప్రముఖ సంగీత దర్శకులు సాయి కార్తీక్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు.
Subscribe
Login
0 Comments