కర్ణాటకలో రాజకీయ పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేడీఎస్ నేత కుమారస్వామి నిన్న ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ముందు జేడీఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని,తమకు కూడా ఇలాంటి పరిస్థితి 1984 వ సంవత్సరంలో ఎదురయ్యింది,అప్పుడు మొత్తం 164 మంది ఎమ్మెల్యేలతో పాటు కర్ణాటక నంది హిల్స్ కు క్యాంప్ వచ్చామని,ఒక ఎమ్మెల్యేను కూడా చేజార్చుకోలేదని,మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. తమకు సరిపడిన మెజారిటీ ఉన్న గవర్నర్ అప్రజాస్వామికంగా బీజేపీ కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేయగా గవర్నర్ నిర్ణయం అప్రజాస్వామికమని దేశమంతా భావిస్తోంది,ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు.
కుమారస్వామికి చంద్రబాబు సలహా…
Subscribe
Login
0 Comments