బిగ్ బాస్,ఈ రియాలిటీ షో ఉత్తరాదిలో మొదలయ్యి మంచి ఆదరణ పొందినది. దాని తరువాత అనేక బాషలలో ఈ షో ను రూపొందించారు. తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ మొదటి సీజన్ తెలుగువాళ్ళ మనస్సులో మదిలో నిలిచిపోయింది,ఈ సీజన్లో శివబాలాజీ గెలుపొందారు. ఎప్పుడు రెండో సీసన్ మొదలవుతుందా,వ్యాఖ్యత ఎవరా అన్న ఆసక్తి అందరిలో మొదలయ్యింది.

కొన్ని రోజుల క్రితం ఈ షో వ్యాఖ్యాతగా నాని వ్యవహరించబోతున్నారని,వచ్చే నెల 20 నుండి షో మొదలవనుందని,దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో సెట్ రూపొందిస్తున్నారని అనేక వార్తలు వచ్చాయ్. వీటన్నింటికి తెర దించుతూ స్టార్ మా బిగ్ బాస్ 2 సంబంధించి ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో న్యాచురల్ స్టార్ నాని చాలా స్టైలిష్ గా కనిపించారు,ఈ ప్రోమోలో “బాబాయ్ ఈసారి ఇంకొంచెం మసాలా ” అనే డైలాగ్ హైలైట్. ఈ సీజన్లో సామాన్యులకు కూడా అవకాశం ఇవ్వడం ప్రత్యేకం గా ఉంది,ఇందులో సెలబ్రిటీస్ ఎవరెవరు పాల్గొంటున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments