ప్రముఖ జర్నలిస్ట్ రచించిన “భగీరథ పధం” పుస్తక ఆవిష్కరణ హైదరాబాదు లో  విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి మహాస్వామి చేతులమీదుగా జరిగినది. ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర స్వామి మాట్లాడుతూ జర్నలిస్ట్ భగీరధలో ఓ విలక్షణమైన రచయత ఉన్నాడని,ఆయన రచించిన “భగీరధ పధం” చదివితే ఆ విషయం తెలుస్తుందని,ఆయన ఎంత మంచి జర్నలిస్టో అంతకు మించిన రచయతని,మరిన్ని పుస్తకాలు ఆయన నుంచి రావాలని కోరుకుంటున్నాని అన్నారు.

ఈ సందర్భంగా సీనియర్ నటి జమున మాట్లాడుతూ భగీరథ తన జీవితాన్ని “జమునాతీరం” పేరుతో రచించారని,ఆ పుస్తకం తనకెంతో పేరు తెచ్చిపెట్టిందని,తనకు ఎన్టీ రామారావు జాతీయ అవార్డు రావడానికి భగీరధే కారణమన్నారు. భగీరధ మాట్లాడుతూ స్వరూపానందేంద్ర స్వామివారి చేతుల మీదుగా “భగీరధ పధం” పుస్తకావిష్కరణ జరగడం చాలా ఆనందంగా ఉందని,ఇదే స్పూర్తితో మరిన్ని రచనలు చేస్తానన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత రమేష్ ప్రసాద్,దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి,నిర్మాత కె. అచ్చిరెడ్డి,రచయత సాయినాధ్,రచయిత్రి పల్లవి,శ్రీకృష్ణదేవరాయాంద్ర భాషానిలయం కార్యదర్శి టి. ఉదయవర్లు పాల్గొన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments