అనుష్క ప్రధాన పాత్రలో నటించిన రుద్రమదేవి మాటల రచయిత రాజసింహ ముంబైలో ఆత్మహత్యాయత్నం చేశారు. ఈయన సందీప్ కిషన్ హీరోగా ఒక అమ్మాయి తప్ప చిత్రానికి దర్శకత్వం వహించి తనేంటో నిరూపించుకున్నారు. నిద్రమాత్రలు మింగి సోఫాలో అచేతనంగా పడి ఉండగా బంధువులు ఆసుపత్రిలో చేర్చారు. సినిమా పరిశ్రమలో అనుకున్నంతగా రాణించలేక పోయాననే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.